![]() |
| ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సబ్ కలెక్టర్ మ్రీనాలి శ్రేష్ట |
బిసిఎం10 న్యూస్ ఆగస్టు 26 భద్రాచలం
భద్రాచలం పట్టణంలో ఈనెల 27న వినాయక చవితి నవరాత్రులు ప్రారంభ సందర్భంగా పట్టణంలో అందరూ భక్తిశ్రద్ధలతో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంబంధిత అధికారులు మరియు ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక బాధ్యతతో వ్యవహరించాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రీనాలి శ్రేష్ట అన్నారు. సోమవారం నాడు సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వినాయక భక్త మండలి ఉత్సవ కమిటీ సభ్యులు మరియు వివిధ శాఖల అధికారులతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహణ తీరుపై ఆయన శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచనల మేరకు గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకావాలని అధికారులకు ఆదేశించారు.అన్ని గణేష్ మండపాల నిర్వాహకులు తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ముందస్తుగా గణేష్ మండలి నిర్వాహకులు పూర్తి వివరాలు అధికారులకు అందించాలని అన్నారు. మండల స్థాయిలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులకు సూచనలు సలహాలు అందించాలని, గణేష్ నవరాత్రి ఉత్సవాలు మొదటి రోజు నుండి నిమజ్జనం వరకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రశాంత వాతావరణంలో అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంతంగా జరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, భక్తమండలి సభ్యులు మండపాలకు విద్యుత్ ఏర్పాటుకు తప్పని సరిగా విద్యుత్ శాఖ నుండి అనుమతి తీసుకోవాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలపై విద్యుత్ అధికారులు మండపాల్లో తనిఖీలు నిర్వహించాలని అన్నారు. విద్యుత్ తీగలకు తగల కుండా ఎత్తు తక్కువ ఉండే విగ్రహాలు ఏర్పాటు చేయాలని, మండపాల్లో మైక్ ఏర్పాటుకు పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి నిమజ్జనానికి విగ్రహాలు వచ్చే అవకాశం ఉన్నందున యంత్రాంగం సూచించిన ప్రాంతాల్లో మాత్రమే అత్యంత భద్రత మధ్య నిమజ్జన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. అధికారులందరూ గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకోవాలని, గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసుకునేందుకు అవసరమైన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని సూచించారు. నిమజ్జనం రూట్ లో అవసరమైన రోడ్డు మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాలని, వినాయక నిమజ్జనానికి వినియోగించే వాహనాలను ముందస్తుగా రవాణాశాఖ అధికారి నుండి ధ్రువీకరణ తీసుకోవాలని, ప్రతి గణేష్ మండపం వద్ద అవసరమైన మేర బందోబస్తు ఏర్పాటు చేయాలని, గణేష్ నిమజ్జనం సజావుగా జరిగే విధంగా కట్టు దిట్టమైన భద్రత వ్యవస్థ ఏర్పాట్లుచేయాలని పోలీస్ శాఖ వారికి సూచించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా భక్తిపాటలు మాత్రమే వినిపించాలని, మతాలు, వర్గాల మనోభావాలను గౌరవించాలని, అధికారులు ఉత్సవ కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని, గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా ఎలాంటి రెచ్చగొట్టే అంశాల జోలికి వెళ్లవద్దని, ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అధికారులకు సహకరించాలని అన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా క్రేన్లు వినియోగించాలని, గణేష్ నిమజ్జనం జరిగే ప్రదేశాలలో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సహకారంతో కలిసికట్టుగా పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అన్నారు. భక్తులకు అందించే స్వామి వారి ప్రసాదాలకు ప్లాస్టిక్ వస్తువులు వినియోగించొద్దని పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని, వ్యర్థాలు వేసేందుకు డస్ట్ బిన్స్ ఏర్పాటు చేయాలని, పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను పూజించాలని, రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసే విగ్రహాలు పర్యావణానికి హాని కలిగిస్తాయన్నారు.భద్రాచలంలోని స్వచ్ఛంద సంస్థలు ఉచిత మట్టిగణపతులు పంపిణీ చేయనున్నారని, ప్రజలు మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఏ ఎస్ పి విక్రాంత్ కుమార్ సింగ్, ఈవో ఎస్ ఎస్ ఆర్ డి అజయ్ కుమార్, ఎడి ఫిషరీస్ ఇంతియాజ్ ఖాన్, డి ఈ ఆర్ అండ్ బి హరిలాల్, ఎం వి ఐ పుల్లయ్య, డిప్యూటీ డిఎంహెచ్ఓ చైతన్య, తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, ఎంపీడీవో నారాయణ మరియు వివిధ మండలాల తాసిల్దార్ లో ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.
FOR ADVERTISEMENT AND INTERVIEWS..
CONTACT : WWW.BCM10NEWS.IN.
CALL : 9000790313

0 Comments